పంచాయతీ, మున్సిపాల్టీలతోపాటు.. పరిషత్ ఎన్నికలను కూడా పూర్తి చేయాలంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండాపోయింది. తాను పదవిలో ఉండగా.. ఆ పని పూర్తి చేయలేనని తేల్చి చెప్పారాయన. దీంతో ప్రభుత్వం కూడా సైలెంట్ అయిపోయింది. అయితే తదుపరి ఎస్ఈసీ గా పదవిలోకి వస్తున్న నీలం సాహ్నితో వీలైనంత త్వరగా పరిషత్ ఎన్నికలు పూర్తిచేయాలని భావిస్తోంది వైసీపీ సర్కారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఏప్రిల్ లోనే ఆగిపోయిన పరిషత్ ఎన్నికలు పూర్తవుతాయి.