అధికార దుర్వినియోగం, వాలంటీర్ల పక్షపాతం అంటూ ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, స్థానిక ఎన్నికల్లో వైసీపీ విక్టరీ మాత్రం స్పష్టం. ఈ దశలో అసలు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రతిపక్షాలకు పరువు దక్కుతుందా అనేది అనుమానమే. అందులోనూ తిరుపతి ఉప ఎన్నికల ముందుగా వచ్చే ఈ ఫలితాలు కార్యకర్తల మనో ధైర్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. అందుకే ఈ ఎన్నికలకు టీడీపీ, జనసేన దూరంగా ఉంటాయని తెలుస్తోంది.