డాక్టర్ గురుమూర్తి రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడంతో ఆయన విజయం కోసం స్థానిక నేతలు చెమటోడ్చాల్సి వస్తోంది. అటు టీడీపీ, బీజేపీ అభ్యర్థులు మాత్రం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అధికార పక్షంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇటు గురుమూర్తి ఎక్కడా గొంతు విప్పి మాట్లాడటంలేదు. ఇంకా బెరుకు పోలేదు. సీనియర్ల మధ్య జూనియర్ లా ఓట్లు అభ్యర్థిస్తున్నారే కానీ సొంతగా ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టలేదు. ఈ దశలో గురుమూర్తి కంటే సహజంగానే.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు బలంగా కనిపిస్తున్నారు.