సహజంగా ఉగాది రోజున.. అన్ని రాజకీయ పార్టీల ఆఫీసుల్లో పంచాంగ శ్రవణం జరగడం ఆనవాయితీ. ఈ ఏడాది ప్లవ నామ సంవత్సరం కూడా ఆ ఆనవాయితీ కొనసాగిస్తారు నేతలు. అయితే రాజకీయ నాయకుల ఆఫీస్ లో వినపడే పంచాంగం కచ్చితంగా వారికి అనుకూలంగానే ఉంటుంది. ప్రజలు చెప్పే పంచాంగమే కాస్త వేరుగా ఉంటుంది. ఈ ప్లవ నామ సంవత్సరం పొలిటికల్ పంచాంగం చూస్తుంటే.. వైసీపీకే అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది.