పవన్ కల్యాణ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారాలి. సినిమాలు పక్కనపెట్టి పూర్తిస్థాయిలో జనజీవితంలోకి రావాలి. ప్రజల తరపున పోరాడాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. పార్టీ నిర్మాణం చేసుకోవాలి. నాయకులను తీర్చిదిద్దుకోవాలి. ఇలా చేయగలిగితే టీడీపీ స్థానాన్ని జనసేన భర్తీ చేయడం పెద్ద కష్టం కాదు. అదే జరిగిదే.. 2024లో కాకపోయినా.. 2029లోనైనా పవన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.