ఇప్పుడు ఈ వీడియో లీక్ కావడం నారా లోకేశ్ ను మరించి చిక్కుల్లో పడేస్తోంది. ఈ వీడియో ద్వారా రెండు విధాలుగా నారా లోకేశ్ బద్నాం అవుతున్నారు. ఆ మనిషే బావుంటే పార్టీ పరిస్థితి ఇలా ఎందుకు అవుతుందని సాక్షాత్తూ అచ్చెన్నాయుడే అనడం వీడియోలో క్లియర్ గా వినిపించింది. పైగా ఈ అభిప్రాయం పార్టీలోనూ బలంగా ఉంది. ఇప్పుడు ఏకంగా అచ్చెన్నాయుడి నోటి నుంచి ఆ డైలాగ్ రావడంతో అది మరోసారి రుజువైనట్టు కనిపిస్తోంది.