కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఉధృతంగా ఉండటంతో టీకాల కార్యక్రమం వేగవంతం చేయాలని నిర్ణయించింది. కానీ ఇప్పటికి దేశంలో కేవలం రెండు కంపెనీలే వ్యాక్సీన్లు తయారు చేస్తున్నాయి. 140 కోట్ల జనాభాకు టీకాలు అందించడం కేవలం వీటి వల్లే సాధ్యం కాదు. అందుకే ఇతర దేశాల వ్యాక్సీన్లకు కూడా అనుమతులు వేగంగా మంజూరు చేయాలని నిర్ణయించింది.