కరోనా టీకాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ధరల విధానంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకించి టీకాను అమ్ముకునే స్వేచ్చ టీకా కంపెనీలకు ఇవ్వడం.. అవి రకరకాల ధరలు ప్రకటించడం వివాదాస్పదం అయ్యాయి. దీనిపై జోరుగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విమర్శలపై కేంద్రం స్పందించింది. కష్టకాలంలో రాజకీయాలు వద్దని సూచిస్తోంది.