కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వ్యవస్థలు విఫలమైనప్పుడు మానవత్వం మేలుకోవాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విఫలమైందని.. ఇక ప్రజలే కరోనా కట్టడికి నడుంబిగించాలని ట్విట్టర్లో పిలుపు ఇచ్చారు. అంతే కాదు.. దేశంలోని కాంగ్రెస్ నాయకులంతా రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా పక్కకు పెట్టి కరోనా కట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.