కేరళ విషయానికి వస్తే.. ఈ రాష్ట్రంలో సత్తా చాటాలన్న బీజేపీ ఎత్తుగడ ఏమాత్రం పారినట్టు కనిపించడం లేదు. అధికారంలోకి వస్తామన్న ఆశలేకపోయినా.. గట్టి పోటీ ఇవ్వాలని.. సాధ్యమైతే స్కోరు గణనీయంగా పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. అందుకు అనుగుణంగా మెట్రో శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. కేరళలోని అయ్యప్ప స్వామి ఇష్యూను రాజకీయం చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఇవేవీ ఓటరుకు పట్టినట్టు లేవు.