ఈటల విషయంలో సీఎం కేసీఆర్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారనే చెప్పాలి.. ఒక మంత్రి అవినీతిపై సాయంత్రం మీడియాలో కథనాలు రావడం.. రాత్రికి విచారణ ఆదేశాలు వెళ్లిపోవడం.. మరుసటి రోజే నివేదిక రావడం.. ఆ తర్వాత రోజే శాఖలు పీకేయడం.. బర్తరఫ్ చేయడం.. ఇంత వేగంగా గతంలో ఎన్నడూ పరిణామాలు జరగలేదు. ఒక విధంగా చెప్పాలంటే.. ఇది కేసీఆర్ విశ్వరూపమే.