అసలు ఈ దేవరయాంజాల్ భూముల కథ ఏంటి..? ఇక్కడ సీతారామ ఆలయానికి వందల ఎకరాల ఆలయ మాన్యం భూములు ఉన్నాయి. అవి 1500 ఎకరాల వరకూ ఉన్నాయని తెలుస్తోంది. 1944 సేత్వార్ ప్రకారం దేవరయాంజాల్ భూములన్నీ సీతారామస్వామి ఆలయం పేరుపైనే ఉన్నాయి. అయితే.. 1954-55 సంవత్సరం నుంచే దేవరయాంజాల్ భూములపై ప్రైవేట్ వ్యక్తుల కన్నుపడింది.