ఈటల ఎపిసోడ్ మొదలైన తర్వాత కేసీఆర్ కేవలం పేపర్ వర్క్ కే పరిమితం అయ్యారు. కరోనానుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు కాబట్టి, మీడియా ముందుకొచ్చే అవకాశం ఉంది. కనీసం తెలంగాణలో కరోనా కట్టడి చర్యల గురించి అయినా వైద్య, ఆరోగ్య శాఖ కూడా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ సమీక్షలు జరపాలి, మాట్లాడాలి. అలా మాట్లాడితే కచ్చితంగా ఈటల ప్రస్తావన ఉండాలి. అయితే కేసీఆర్ మాత్రం ఈటల పేరెత్తడం కానీ, ఆ వివాదం గురించి స్పందించడం కానీ చేయబోరని ఆయన వ్యవహార శైలి తెలిసినవారంటున్నారు.