జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం ఎంత అవసరమో.. వేగంగా నిర్ణయం తీసుకోవడం కూడా అంతే అవసరం అన్న సంగతి ఈటల గుర్తించడం లేదేమో అనిపిస్తోంది. ఈ మాత్రం గ్యాప్లో కేసీఆర్ ఈటల అనుచర వర్గాన్ని ఆయనకు దూరం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అధికార వర్గంలోనూ ఆయన మనుషులుగా పేరున్న అందరికీ షాకులు ఇస్తున్నారు. ఈటల ఇలా ఇంకా మీనమేషాలు లెక్కిస్తే కేసీఆర్ ఆయన్ను సులభంగా అణగదొక్కేయడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.