బెంగాల్ శాంతి భద్రతల సమస్య ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. పరిస్థితి శృతి మించితే కేంద్రం జోక్యం చేసుకోడాన్ని ఎవరూ కాదనరు కానీ.. ప్రస్తుతం దేశంలో ఉన్న కొవిడ్ విలయాన్ని సైతం పక్కనపెట్టి, బెంగాల్ పై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టడాన్ని టీఎంసీ తీవ్రంగా తప్పుపడుతోంది. వ్యాక్సినేషన్ ని సమర్థంగా అమలు చేయలేని కేంద్రం, ఆక్సిజన్ సరఫరాపై చేతులెత్తేసిన కేంద్రం.. ఇప్పుడు బెంగాల్ ని టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మోది దిగిపో అంటూ.. నినాదాలు మొదలవుతున్న వేళ, తటస్థులు, మేధావులు సైతం ప్రధానిని టార్గెట్ చేస్తున్నారు. తమకు ఓ ప్రభుత్వం కావాలని, మోదీ ప్రధాని పదవినుంచి స్వచ్ఛందంగా వైదొలగి, వేరొకరికి అవకాశం ఇవ్వాలంటూ అరుంధతి రాయ్ వంటి వారు సైతం డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎన్డీఏ నష్టనివారణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. బెంగాల్ లాంటి ఉదంతాలను తెరపైకి తెచ్చి, అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.