చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం ఎదురుగా శశికళకు మద్దతు తెలుపుతూ వెలసిన పోస్టర్లు సంచలనంగా మారాయి. చెన్నై ప్రధాన కార్యాలయం ఎదుట, పుదుక్కోట్టై ప్రాంతంలో కూడా వీటిని అతికించారు. ఎంజీఆర్ రూపొందించిన, జయలలిత కాపాడిన పార్టీని శశికళ ఆధ్వర్యంలో నడిపిద్దామంటూ అందులో నినాదాలు రాశారు అభిమానులు. అన్నాడీఎంకేలో ఇంకా ప్రతిపక్ష నేత ఎవరనేది ఖరారు కాని స్థితిలో ఇలా పోస్టర్లు వెలియడం పార్టీ వర్గాలలో కలకలం రేపింది.