కొత్త విధానం రాష్ట్రాల మధ్య తీవ్రమైన అసమానతలకు దారి తీస్తుంది. బాగా వనరులున్న రాష్ట్రాలు తమకు అవసరమైన వాక్సిన్లను సంపాదించుకుంటాయి. పేద రాష్ట్రాలు వాక్సిన్లు సంపాదించలేక ఇబ్బంది పడతాయి. అంటే భారత పౌరులలో కొందరికి వాక్సిన్ అందుతుంది, కొందరికి అందదు. మరి మోదీ ఈ విధానంతో పేద రాష్ట్రాలను బలి చేస్తున్నారా..?