నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ విషయంలో టీడీపీ మొదటినుంచీ ప్రభుత్వాన్ని తప్పుబడుతోంది. ఆయన అరెస్ట్ ని ఖండిస్తూ చంద్రబాబు, లోకేష్.. ఇతర నాయకులంతా మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రఘురామపై కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. తాజాగా రఘురామకృష్ణంరాజుకి ప్రాణహాని ఉందని ఏకంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు చంద్రబాబు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ ప్రాణాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బాబు ఈ లేఖలో గవర్నర్ ను కోరారు.