పారుల్ కక్కర్..ఈమె ఓ గుజరాతీ కవియిత్రి. గృహిణి అయిన పారుల్ కొన్నేళ్లుగా కవిత్వం రాస్తున్నారు. కొడుకు ఫేస్బుక్ ను పరిచయం చేయడంతో పారుల్ కవితలకు ప్రాచుర్యం లభించింది. ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. అభిమానులూ పెరిగారు. ఆధ్యాత్మిక గేయాలు, శ్రీ కృష్ణుని మీద భక్తి గీతాలతో గుజరాత్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆమెపై నరేంద్ర మోడీ అభిమానుల దాడి మొదలైంది. ఫేస్బుక్లో ఆమె రాసిన ఓ కవితే ఇందుకు కారణం.