కరోనా కల్లోల సమయంలో పేదలు, మధ్యతరగతి వారు వైద్య ఖర్చులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నారు. ఆస్తులు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి. అంతా చేసినా ప్రాణాలు నిలబడతాయన్న గ్యారెంటీ లేదు. ఈ దశలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు అండగా నిలిచింది. కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు రావడం, కొవిడ్ మృతుల అంత్యక్రియలకోసం ఆర్థిక సాయం, కొవిడ్ కారణంగా అనాథలుగా మారిన చిన్నారులకు ఆర్థిక సాయం వంటి నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇలాంటి నిర్ణయాలలో వెనకబడ్డారనే చెప్పాలి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ విషయంలో ఆయన తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.