ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ 20 వేలకుపైగా కేసులు వెలుగు చూస్తున్నాయి. రోజూ కనీసం 100 మంది వరకూ అధికారికంగానే కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ నిన్న ఒకే రోజు మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి మూడూ కరోనా సమయంలో ప్రజలకు మేలు చేసే నిర్ణయాలే.