బెంగళూరులో ప్రభుత్వం ఓ వినూత్న ప్రయోగం చేసింది. బెంగళూరు మెట్రో బస్సుల్లో కొన్నింటిని మొబైల్ ఆక్సీజన్ కేంద్రాలుగా మార్చారు. బస్సుల్లో ఆక్సీజన్ సౌకర్యం కల్పించారు. ఆ బస్సులు నగరవ్యాప్తంగా తిరుగుతుంటాయి. ఎక్కడైనా కరోనా రోగికి ఆక్సిజన్ అవసరమైతే.. ఆ బస్సులో ఆక్సీజన్ ఇస్తారు. అదే బస్సులో రోగిని ఆస్పత్రికి తరలిస్తారు. ఇలా బస్సుల్లో ఆక్సీజన్ ఇవ్వడం చాలా మంది రోగులను కాపాడుతోంది.