కేసీఆర్ నేరుగా ఐసీయూ వార్డుల్లోకి వెళ్లడం.. అక్కడి రోగుల బాధలు శ్రద్ధగా వినడం, నేనున్నానని ధైర్యం చెప్పడం.. ఆ దృశ్యాలన్నీ మీడియాలో ప్రముఖంగా రావడంతో సీన్ మారిపోయింది. కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇన్నాళ్లూ వచ్చిన విమర్శలన్నీ ఈ ఒక్క 40 నిమిషాల పర్యటనతో కొట్టుకుపోయినట్టయింది.