రఘురామ కృష్ణంరాజును ఏకంగా పుట్టినరోజు రోజే అరెస్టు చేయడం.. అది కూడా సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేయడం ఆ తర్వాత కస్టడీలో ఉంచడం.. ఆ తర్వాత గాయాలు.. బెయిల్ కోసం రఘురామ కృష్ణంరాజు ప్రయత్నాలు.. జిల్లా కోర్టు, సీఐడీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జరిగిన న్యాయ పోరాటం అంతా ఉత్కంఠభరితంగా సాగింది. అరెస్టు ప్రారంభం నుంచి మీడియాలో రఘురామ కృష్ణంరాజు పేరు మారుమోగింది. ప్రస్తుతానికి ఆయనకు బెయిల్ రావడంతో జగన్పై పైచేయి సాధించిన నాయకుడిగా గుర్తింపు లభిస్తోంది.