కొన్నాళ్లుగా ఏపీలో హైకోర్టు తీర్పులపై వైసీపీ నేతలు పెద్దగా కామెంట్లు చేయడంలేదు. తీర్పులు కూడా పెద్ద వ్యతిరేకంగా ఏమీ రాలేదు. కానీ.. ఇప్పుడు మరోసారి జగన్కు బ్యాడ్ డేస్ మొదలయ్యాయా అనిపిస్తోంది. తాజాగా ఆయనకు వరుసగా ఇటు ఏపీ హైకోర్టులోనూ.. అటు సుప్రీంకోర్టులోనూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసుల్లో ఎదురుదెబ్బలు తగిలాయి.