ఈటలతో భేటీ జరిగిందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈటలతో అసలు తాను సమావేశం కాలేదని, కానీ ఆయన తనను కలవాలనుకుంటున్నట్టు కబురు పంపిన మాట మాత్రం వాస్తవం అని అన్నారు కిషన్ రెడ్డి. గతంలోతాము కలసి పనిచేశామని, ఇప్పుడు మరోసారి కలవాలనుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.