ఇన్నాళ్లూ మరో ఏడాదిలో జమిలి ఎన్నికలొస్తాయి, మనదే అధికారం అంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇప్పుడు మూడేళ్లు ఆగండి మనదే అధికారం అంటున్నారు. మరి ఆ అధికారం ఎలా వస్తుందంటే మాత్రం చంద్రబాబు దగ్గర సరైన లాజిక్ లేదు. పోనీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ వచ్చి ఉంటే.. దాని ఆధారంగా వచ్చే ఎన్నికలనాటికి మరింతగా పుంజుకుంటామని చెప్పొచ్చు. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలిచింది. మరి చంద్రబాబు ఏ లాజిక్ ప్రకారం మూడేళ్లలో టీడీపీదే అధికారం అంటున్నారో తేలాల్సి ఉంది.