ఎన్టీఆర్ జీవితాశయం సినిమాలే, రాజకీయాలు కాదు. అప్పట్లో సినిమావాళ్లకి రాజకీయ సంబంధాలున్నా కూడా పరిమితమే. అయితే అరవయ్యేళ్లు పూర్తయ్యే నాటికి ఎన్టీఆర్ లో సామాజిక సేవ చేయాలనే తపన మొదలైంది. సినిమాలతో ఇన్నాళ్లూ తెలుగు ప్రజల్ని రంజింపజేశాను, ఇకపై నెలలో 15రోజులపాటు సామాజిక సేవ చేస్తానంటూ.. 1981లో సర్దార్ పాపారాయుడు చిత్రీకరణ సమయంలో ఆయన అన్నమాటలు.. ఆ తర్వాత ఆయన్ను.. పూర్తి స్థాయి నాయకుడిలా చేశాయి.