ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అంటాడు దాశరథి. నిజమే.. ప్రశాంతంగా ఆహ్లాదంగా కనిపించే సముద్రం అప్పుడప్పుడు అల్లకల్లోలమవుతుంది. తీర ప్రాంత వాసుల జీవితాలనూ అల్లకల్లోలం చేస్తుంది. అందులోనూ ఇండియా ద్వీపకల్పం.. గత 50 ఏళ్ల లెక్కలు తీస్తే.. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 117 తుపాన్లు తీర ప్రాంతాలను అల్లకల్లోలం చేశాయి. దాదాపు 40 వేల మందిని సముద్రుడు బలి తీసుకున్నాడు.