ఏదో ఐదేళ్లు పాలనతో సరిపుచ్చుకునే వారికి సంక్షేమ బాట ఓకే కానీ.. దీర్ఘకాలం అధికారంలో ఉండాలంటే.. అభివృద్ధి కూడా ఉండాలి. లేకపోతే.. ఐదేళ్ల తర్వాత ఇదే స్థాయిలో సంక్షేమం అమలు చేసేందుకు నిధులు ఉండవు. ఆ కోణంలో చూస్తే జగన్ సర్కారుకు అత్తెసరు మార్కులే పడతాయి. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తేనే 30 ఏళ్ల పాలన కల నెరవేరుతుందని జగన్ గుర్తించాలి.