సాక్షి పత్రిక తాజాగా ఓ విధానం ప్రకటించి మిగిలిన మీడియా సంస్థలకు ఆదర్శంగా నిలిచింది. దీని ప్రకారం.. సాక్షి మీడియా తన పత్రిక, తన టీవీల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు.. అంటే జర్నలిస్టులే కాదు, ఇతర సిబ్బంది కూడా.. కరోనాతో మరణిస్తే ఆ కుటుంబాలకు ఆసరాగా నిలవడం కోసం రూ. 25 వేలు అంతకంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు ప్రస్తుత జీతాన్ని ఏడాదిపాటు నెలనెలా చెల్లిస్తారు. రూ. 25 వేలు ఆ పైన ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు రూ. 25 వేలు ఏడాది పాటు ప్రతినెలా చెల్లిస్తారు.