రెండేళ్ల వైసీపీ పాలనలో లోటుపాట్లేంటి అని అందరూ చర్చిస్తున్నారు. అదే సమయంలో రెండేళ్లలో ప్రతిపక్షంగా టీడీపీ సాధించిన పురోగతి ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమే. చరిత్రలో ఎప్పుడూ ఎరగని విధంగా 2019లో ఘోర పరాజయం పాలైంది టీడీపీ. 175 సీట్లకు గాను కేవలం 23సీట్లతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి. వారిలో కొంతమంది జారిపోయారు కూడా. ఈ క్రమంలో రెండేళ్లు గడిచిపోయాయి. మరి ఈ రెండేళ్లలో ప్రజల్లో టీడీపీ బలం పుంజుకోగలిగిందా..? పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిందా..?