2024కు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే.. ఆయన కోసం పని చేసేందుకు సిద్ధం అంటూ ప్రశాంత్ కిషోర్ ఓ ఆఫర్ ఇచ్చాడు. అంటే ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని భావిస్తున్నారన్నమాట. ఇప్పటికే జగన్, మమత, స్టాలిన్లతో మంచి సంబంధాలున్న ప్రశాంత్ కిషోర్ గట్టిగా ప్రయత్నిస్తే.. వచ్చే ఎన్నికల్లో మోదీకి గెలుపు కష్టం కావచ్చు కూడా.