యోగికి గత నాలుగేళ్లుగా ట్విట్టర్ ద్వారా విషెష్ చెబుతున్న మోదీ.. ప్రతి ఏటా కాస్త మేటర్ మారుస్తూ వస్తున్నారు. 2017 లో యూత్ పుల్ & డైనమిక్ లీడర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలను ట్వీట్ చేశారు. 2018 లో యోగి బాగా కష్టపడుతున్నాడని మెచ్చుకున్నారు. 2019 లో యోగి డైనమిక్ నాయకత్వంలో యూపీ అభివృద్ధి చెందాలని కోరారు. 2020 లోనూ యోగి డైనమిక్ లీడర్ అని.. యూపీ ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చెందాలన్నారు. కానీ.. సరిగ్గా ఎన్నికల ముందు.. ఈ ఏడాది మాత్రం అసలు శుభాకాంక్షలే చెప్పలేదు.