మోదీ సర్కారు ఘనంగా చెప్పుకునే అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతున్న అయోధ్య జిల్లాలో 40 సీట్లలో 34 సీట్లలో బీజేపీ మట్టికరిచింది. కేవలం ఆరు సీట్లు మాత్రమే దక్కించుకుంది బీజేపీ. ఈ ఫలితాలు చూస్తే ఉత్తర్ ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై ప్రజావ్యతిరేకత ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది.