రఘురామ ప్రయత్నాలతో జగన్ బెయిల్ రద్దవుతుందా.. జగన్ జైలుకు వెళ్లే అవకాశం ఉంటుందా.. అసలు రఘురామ కృష్ణంరాజు వాదనలు కోర్టుల్లో నిలుస్తాయా.. ప్రజాప్రతినిధుల్లో సానుభూతి సాధించడం కోర్టులను ప్రభావితం చేస్తుందా.. అన్నది ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. ఏదేమైనా రఘురామ కృష్ణంరాజు జగన్ బెయిల్ రద్దు చేయిస్తారో లేదో చెప్పలేం కానీ.. తన శాయశక్తులా జగన్ ను ఇబ్బంది పెట్టేందుకు మాత్రం కృషి చేస్తున్నారు.