కరోనా కష్టకాలం ప్రజలనే కాదు, ప్రభుత్వాలని కూడా ఇబ్బంది పెడుతోంది. ఇక ప్రతిపక్షాలది మరో కష్టం. అటు ప్రభుత్వాన్ని విమర్శించలేక, ఇటు జనాల్లోకి వెళ్లలోక ప్రతిపక్ష నేతలు కేవలం సోషల్ మీడియానే నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఏపీలో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ పక్కరాష్ట్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కేవలం జూమ్ మీటింగ్ లతోనే సరిపెట్టాల్సిన పరిస్థితి.