ఈటల వ్యవహారంతో ఇటీవల టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు మరోసారి చర్చకు వచ్చాయి. పార్టీనుంచి పోతూ పోతూ.. హరీష్ రావు అసంతృప్తిపై కూడా ఈటల వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీంతో హరీష్ కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ విషయం పక్కనపెడితే.. మేనల్లుడు హరీష్ రావుని గతంలో కాస్త నిర్లక్ష్యం చేసిన కేసీఆర్, ఇప్పుడు ఏరికోరి ఆయనకే కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది.