ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ కీలక నేత జితిన్ ప్రసాద సడన్ గా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీనపడిపోతుందని, బీజేపీ బలం పెరిగిపోతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అదే సమయంలో అసలు బీజేపీకి ఇలాంటి వలసలు ఎంతమేరకు కలిసొస్తాయనే అనుమానం కూడా వస్తోంది. పశ్చిమబెంగాల్ లో కూడా ఇలాగే వలసల్ని విపరీతంగా ప్రోత్సహించించి బీజేపీ. కట్ చేస్తే.. అక్కడ సువేందు అధికారి మినహా.. ఇతర నాయకులెవరూ కమలదళానికి ఉపయోగపడలేకపోయారు. టీఎంసీనుంచి వచ్చి బీజేపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. చివరికిప్పుడు వారంతా మమత జట్టులోకి వెళ్లడానికి ఉబలాటపడుతున్నారు.