ఆమధ్య వివిధ కారణాలతో ఏపీ పోలీస్ బాస్ హైకోర్టు మెట్లెక్కారు. అదే సమయంలో పోలీసులు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారారంటూ ప్రతిపక్షాలు విమర్శల డోసు కూడా పెంచాయి. విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్ లపై పోలీసులు గతంలో తీవ్ర స్థాయిలో కన్నెర్రజేశారు. అసభ్యంగా, అభ్యంతరకరంగా పోస్టింగ్ లు పెట్టేవారిని కటకటాల వెనక్కు నెట్టారు. అయితే ఇలా ఇబ్బందులు ఎదుర్కొన్నవారిలో ఎక్కువమంది టీడీపీ సానుభూతిపరులని, కావాలనే తమను టార్గెట్ చేస్తున్నారని ప్రతిపక్షం ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడీ పరిస్థితుల్లో మార్పులొచ్చినట్టు తెలుస్తోంది.