దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. మౌనంగా భరిస్తున్న ప్రజలు, ఎన్నికల్లో ఎన్డీఏకి చుక్కలు చూపించడం ఖాయం అని అనుకుంటున్నారంతా. వచ్చే ఏడాది జరగబోతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పెరుగుతున్న పెట్రోల్ రేట్లు కీలకంగా మారతాయని ఓ అంచనా. అంతే కాదు, కరోనా కష్టకాలంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, వ్యాక్సినేషన్ ఆలస్యం కావడం, ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు ఇబ్బంది పడటం.. ఇవన్నీ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. కానీ అక్కడుంది మోదీ. ఆయన్ను అంత తక్కువ అంచనా వేయలేం. సరిగ్గా ఎన్నికలనాటికి ఏదో ఒక జిమ్మిక్కు చేసి ఒడ్డునపడగల సత్తా ఆయనతోపాటు, ఆయన టీమ్ కి కూడా ఉంది.