రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చినప్పుడు కేంద్రం కొత్తగా ఫలానా వరాలు ప్రకటించింది అని చెప్పుకుంటారు. కానీ ఏపీ విషయంలో మాత్రం ముఖ్యమంత్రులు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా వారి వ్యక్తిగత అజెండాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. జగన్ ఢిల్లీ వెళ్లినా టార్గెట్ చంద్రబాబు, లేదా రఘురామకృష్ణంరాజు అనే పరిస్థితే కనిపిస్తుంది. ఒకరకంగా హస్తిన రాజకీయాల విషయంలో చంద్రబాబు చేసిన తప్పుల్నే జగన్ రిపీట్ చేస్తున్నారని అనుకోవాల్సిన సందర్భం. కేంద్ర మంత్రులతో ఏయే అంశాలు చర్చించారు, ఎంతవరకు హామీలు పొందగలిగారు.. అనే వాటిపై జగన్ కూడా ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాఖలాలు లేవు.