గతంలో పెట్రో ధరలు ఎప్పుడో 2,3 నెలలకు పెంచేవారు. ఇప్పుడు ఆ విధానం తీసేసి.. రోజువారీగా ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ పెట్రోలియం సంస్థలకు కట్టబెట్టినప్పటి నుంచి ఈ ధరలకు పట్టపగ్గాలు లేకుండాపోతున్నాయి. ఇలా అడ్డదారుల్లో పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజల బాధ్యతల నుంచి కేంద్ర, రాష్ట్రాలు తప్పుకుంటున్నాయి.