కరోనా ఫస్ట వేవ్ సమయంలో ప్రజల లాక్ డౌన్ కష్టాలు తీర్చేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వలస కార్మికులకు సాయం చేస్తూ బిజీబిజీగా గడిపారు. ఊరూరా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు, కూరగాయలు, నిత్యావసరాలు అందించారు. బహుశా స్థానిక ఎన్నికల సమయం కావొచ్చు.. అనుకున్నదానికంటే ఎక్కువగానే పేదలకు సాయం చేశారు. అందరి మెప్పు పొందారు. ఇప్పుడు సెకండ్ వేవ్ సమయానికి నేలతంతా ఎక్కడికక్కడ గప్ చుప్. దాదాపుగా ఎమ్మెల్యేలెవరూ జనాల్లోకి రావడంలేదు.