ఆనందయ్య ఆయుర్వేదం మందు గురించి ఆమధ్య ఏపీలో ఎక్కడలేని చర్చ. ఏపీలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే హాట్ టాపిక్. ఆగిపోయిన అనందయ్య మందుకి అనుమతిస్తారా లేదా అనేది గతంలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవడం, ప్రభుత్వం అనుమతివ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. మరి ఆనందయ్య మందు ఇప్పుడు అందరికీ అందుతోందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో జరిగినట్టు కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ ఆ స్థాయిలో జరగడంలేదు.