గతంలో తాము ఇచ్చిన ఉద్యోగాల విషయంలో సీఎం జగన్ చెప్పినవన్నీ అక్షర సత్యాలే, భర్తీ చేయబోతున్న పోస్ట్ ల గురించి కూడా ఎక్కడా అతిశయోక్తులు లేవు. కానీ ఊహించినదానికంటే పోస్ట్ ల సంఖ్య దారుణంగా తగ్గిపోవడంతో నిరుద్యోగులు భగ్గమన్నారు. ఊరూవాడా ఆందోళనలు మొదలయ్యాయి. అసలు జగన్ జాబు క్యాలెండర్ ప్రకటించకుండా ఉన్నా సరిపోయేది. ఎలాంటి విమర్శలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగుల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.