గతంలో దుబ్బాక ఉప ఎన్నికను అతి విశ్వాసంతో టీఆర్ఎస్ చేజార్చుకుంది. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ, అలాంటి పరిస్థితులు రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ తన ప్రణాళిక అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం హుజూరాబాద్ ని టార్గెట్ చేయకుండా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. జనాల్లోకి వస్తున్నారు, జనం మధ్యలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలనాటికి, అన్ని వర్గాల్లో సింపతీ సాధించి, ఈటలపై టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయానికి బాటలు వేస్తున్నారు.