ఇటీవల కాలంలో బరువు తగ్గి, గడ్డం పెంచి, హెయిర్ స్టైల్ మార్చిన లోకేష్, భాషను కూడా పూర్తిగా మార్చేశారు. సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. వైసీపీ అంతే ఘాటుగా రిప్లై ఇచ్చినా, లోకేష్ ఆ స్థాయిలో పరుషపదజాలం ఉపయోగిస్తారని ఎవరూ ఊహించలేదు. ఒకరకంగా టీడీపీ శ్రేణులు కూడా లోకేష్ వ్యవహారశైలితో ఆశ్చర్యంలో మునిగిపోయాయి. అదే ఊపుతో ఇప్పుడు ఆయన పార్టీ ఆందోళనలకు నాయకత్వం వహిస్తారో లేదో చూడాలి.