జగనన్న కాలనీల పేరుతో సకల సౌకరక్యాలతో ఈ లేఅవుట్లను వేశారు. 3 లక్షల 3వేల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే మొదలయ్యాయి. జులై 19నాటికి మొత్తం 7లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలనేది సీఎం జగన్ ఆలోచన. జూన్ 2022నాటికి మొదటి విడత ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. గతంలో ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆ కార్యక్రమం కొన్నాళ్లు వాయిదా వేశారు. ఇప్పుడు బ్యాంకుల సహకారంతో ఇళ్లు నిర్మించడమే మిగిలుంది. ఈసారి ఎవరిపైనా సాకు చెప్పే అవకాశం లేదు, ప్రతిపక్షాలు అడ్డుకోలేవు. అంటే ప్రభుత్వం చెప్పినట్టు 2022 జూన్ నాటికి గృహప్రవేశాలు జరిగితే జగన్ అనుకున్నది సాధించినట్టే.