విశాఖను పరిపాలనా రాజధానిగానే కాదు, ఐటీ రాజధానిగా మారుస్తామని చెప్పింది వైసీపీ ప్రభుత్వం. అంతకు ముందే టీడీపీ కూడా విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు తీసుకు రావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. విదేశీ టూర్లు, పర్యటనలు, దావోస్ మీటింగ్ లు.. ఇలా అప్పట్లో హడావిడి బాగానే కనిపించేది. కానీ ఇప్పుడు ఆ హడావిడి లేదు, అసలు పని కూడా జరగడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. లులు కంపెనీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగేశాయి. కారణాలేవైనా ఇవన్నీ వైసీపీ హయాంలోనే జరగడం విశేషం.